ట్రైలర్ టాక్ – పబ్లిసిటీలోనే యాంకర్… సినిమాలో ప్చ్..!

Raja Meeru Keka Trailerఒకప్పుడు బుల్లితెరపై బాగా సందడి చేసిన యాంకర్ లాస్య గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ఆ బ్యూటీ ఇప్పుడు వెండితెరపై నటిస్తోంది అంటూ “రాజా మీరు కేక” సినిమా గురించి పబ్లిసిటీ బాగా ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత గల పాత్రలో నటించిందేమోనన్న టాక్ వెలువడింది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ లో మాత్రం, లాస్య పాత్ర కేవలం రెండు, మూడు సన్నివేశాలలో మాత్రమే చూపించారు. దీంతో లాస్య కున్న క్రేజ్ ను కేవలం పబ్లిసిటీ పరంగానే వినియోగించుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ సినిమా కధ మొత్తం ముగ్గురు యువకులు రేవంత్, నోయెల్, హేమంత్ ల చుట్టూ తిరుగుతుంది. సాఫీగా సాగిపోతున్న కధలోకి బిజినెస్ మెన్ గా నందమూరి తారకరత్న ఎంట్రీ ఇవ్వడంతో ప్రారంభమైన ఇబ్బందులను, సదరు ముగ్గురు యువకులు ఎలా అధిగమించారు అన్నదే చిత్ర ప్రధాన కధాంశంగా కనపడుతోంది. తారకరత్న సినిమాకు ప్లస్ అవుతారో, మైనస్ అవుతారో తెలియాలంటే విడుదలకు వెయిట్ చేయాల్సిందే. చిన్న సినిమా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories