చంద్రబాబు నాకు బాస్ ఎవరేమనుకున్నా బీజేపీ ఎమ్మెల్యే

Raja Singh says Chandrababu Naidu is his bossటీడీపీకి బీజేపీకి మధ్య ఈరోజు ఉన్న అగాధం తెలియనిది కాదు. 2018లో టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాకా ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు నా బాస్ ఎవరేమన్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ADVERTISEMENT

“నేను ముందే బీజేపీలో ఉండాలి. అయితే కొందరు నాయకులు అది జరగనివ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు.. నాకు బాస్. అప్పుడు బాస్ అనేవాడిని ఇప్పుడు బాస్ అనే అంటా. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు లిఫ్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నేను దానిని ఎప్పటికీ మర్చిపోను,” అని రాజా సింగ్ చెప్పుకొచ్చారు.

“ఎవరేమనుకున్నా అది ఎప్పటికీ మర్చిపోను. దాని తరువాత నా కారణం గా టీడీపీకి బాడ్ నేమ్ వచ్చేలా కొంత మంది ప్లాన్ చేశారు. దానితో ఆయన మీద ఒత్తిడి పెరిగింది. కొంత మంది రాజా సింగ్ ని తీయకపోతే వెళ్ళిపోతాం అంటూ బెదిరించారు. ఆయనకు ఇబ్బంది కలిగించకూడదని నేనే రాజీనామా చేసేసా,” అన్నారు.

ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో రాజా సింగ్ ఒకరు. వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు టీడీపీ నుండి కార్పొరేటర్ గా గెలిచారు రాజాసింగ్. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఆయన గోవధ పై నిత్యంపోరాటం చేసి జాతీయ స్థాయిలో పాపులర్ అయిన నేత.

ADVERTISEMENT
Latest Stories