తెలంగాణ బీజేపీలో సమూలమైన ప్రక్షాళన తప్పదా?

Raja Singh - BJPఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు సాధించింది. నామమాత్రంగా 7% ఓట్లు సంపాదించగలిగింది. 118 స్థానాలలో 103 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘోరంగా ఓడిపోయారు. సొంత నియోజకవర్గమైన ముషీరాబాద్ లో మూడవ స్థానంలో ఉండిపోయారు ఆయన. దీనితో పార్టీలో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కొందరైతే బిజెపి నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ ను అద్యక్షుడిని చేయాలని సూచిస్తున్నారట.

[m9ad]

ADVERTISEMENT

ప్రధాని మోడీ,బిజెపి అద్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పలువురు ప్రచారం చేసినా, కేవలం ఒక్క సీటే గెలుచుకోవడం,లక్ష్మణ్ దారుణంగా ఓడిపోవడంం వల్ల పార్టీ పరువు పోయిందని కార్యకర్తలు భావిస్తున్నారు.అందువల్ల కొత్త నాయకత్వానికి బాద్యతలు అప్పగించాలని కోరుతున్నారు. హిందుత్వ, భారత మాత లను ప్రజల వద్దకు తీసుకు వెళ్లగలిగే నాయకుడు కావాలని దీనికి రాజాసింగ్ సరైన వ్యక్తి అని వారు అంటున్నారు. అయితే రాజా సింగ్ దూకుడుగా చేసే వ్యాఖ్యల వల్ల పార్టీ తరచుగా ఇబ్బందులకు గురవుతుంది.

కొందరైతే కరీంనగర్ లో గట్టి పోటీ ఇచ్చిన బండి సంజయ్, కల్వకుర్తిలో పోటీచేసి ఆచారి వంటివారికి నాయకత్వం అప్పగించాలని సూచిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇంత సమూలమైన ప్రక్షాళనకు పార్టీ అధినాయకత్వం పూనుకుంటుందా అనేది చూడాలి. డిసెంబర్ 24న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందా అనేది పార్టీ వర్గాలలో ఆసక్తి ఉంది. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరిలో తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories