హీరో రాజశేఖర్ కారు యాక్సిడెంట్!

Rajasekhar met with an accidentటాలీవుడ్ సినీ హీరో రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నవంబర్ 3వ తేదీన విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్న “గరుడవేగ” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రాజశేఖర్, చిత్రీకరణ ముగించుకుని ఆదివారం నాడు రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుండి తన కారులో నివాసానికి పయనమయ్యారు. స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ వస్తున్న వాహనం పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి చేరుకున్న తర్వాత, ఎదురుగా ఉన్న మరో కారును డీ కొట్టారు. దీంతో సదరు కారులో ఉన్న రాంరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

బహుశా మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారేమోనని భావించిన పోలీసులు బ్రీథ్ పరీక్షలు నిర్వహించగా, రాజశేఖర్ ఎలాంటి మద్యం సేవించలేదని నిర్ధారించారు. అలాగే రాంరెడ్డి అనే వ్యక్తి కూడా రాజీకి రావడంతో పోలీసులు వెంటనే ఇరువర్గాలను పంపించి వేసారు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న రాజశేఖర్ సతీమణి జీవిత, వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన తల్లి ఇటీవల మరణించడంతో రాజశేఖర్ పూర్తి డిప్రెషన్ లో ఉన్నారని, అందువలనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో రాజశేఖర్ బయటపడ్డారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories