బీజేపీకు పెద్ద షాక్; కాంగ్రెస్ కంబ్యాక్!

Narendra Modi - Amit Shah -Jagan-అతితొందర్లొ బీజేపీ ఎన్నికలకు వెళ్ళబోతుంది అని వినిపిస్తున్న తరుణంలో ఆ పార్టీకి పెద్ద షాక్ ఎదురయ్యింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని నౌపరా అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

ఉలుబేరియా లోక్‌సభ స్థానంలోనూ తృణమూల్‌ గెలుపు దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి కీలక ప్రాంతాలైన అజ్మేర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా ఆ పార్టీకి చుక్కలు చూపించాయి. రెండు స్థానాలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుంది.

ADVERTISEMENT

మెజారిటీలు కూడా భారీగా ఉన్నాయి. మూడోస్థానమైన మందల్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ కు రెబెల్ తలపోటు ఉన్న గెలుపు దిశగా వెళ్తుంది. ఈ మూడు స్థానాల్లో గతంలో భాజపా గెలుపొందింది. దీనితో బీజేపీ ఆలోచనలో పడింది. దీనితో ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచన చేస్తాదేమో చూడాలి

ADVERTISEMENT
Latest Stories