సినిమాలు ఫస్ట్… ఆ తర్వాత రాజకీయం..!

Rajinikanth-Tamil-Nadu-Politicsతన పొలిటికల్ ఎంట్రీని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి పోస్ట్ పోన్ చేసి అభిమానులను పూర్తిగా నిరాశపరిచారు. 31వ తేదీన కీలక ప్రకటన చేస్తానంటూ ఊరించిన సూపర్ స్టార్… చివరకు మళ్లీ మొదటికే వచ్చారు. తన తాజా చిత్రాలు ‘2.0 ‘, ‘కాలా’ విడుదల తర్వాత… తన భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని చెప్పారు.

చైన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో తన అభిమానులతో ఐదో రోజు సమావేశం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. తాను సినీ రంగంలోకి రావడానికి తన మిత్రుడు కారణమని… ఖర్చులకు డబ్బులు కూడా అతనే ఇచ్చాడని ఈ సందర్భంగా రజనీ చెప్పాడు. నిరుపేద స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. తన ఉన్నతికి ఎందరో దర్శకులు కారణమని అన్నారు.

ADVERTISEMENT

తన గురువు బాలచందర్ లేదపోతే రాజనీకాంత్ అనేవాడు లేడని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ‘2.0’ సినిమా విడుదల ఆలస్యమవుతోందని తెలిపారు. గతంలో తాను అనారోగ్యానికి గురయ్యానని… అభిమానుల ప్రార్థనల వల్లే కోలుకున్నానని చెప్పారు. తన అభిమానులంతా సంతోషంగా ఉండాలని… మంచి మార్గంలో నడిస్తే, అంతా మంచే జరుగుతుందని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories