‘లోటస్ పాండ్’ సమీపంలో తెలుగు టాప్ ‘హీరోయిన్’

rakul preet singh buys house at lotus pondటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ‘ఎఫ్45జిమ్’ పేరుతో ఒక జిమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే జిమ్ తో పాటు తనకు అనువుగా ఉండే విధంగా ఒక నివాసాన్ని కూడా చూడాలని సదరు వ్యవహారాలు చూస్తున్న మేనేజర్ కు బాధ్యతలు అప్పగించగా, ఇటీవలే ఆ బాధ్యతలను సదరు మేనేజర్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వైయస్ జగన్ నివాసం ఉంటున్నటువంటి ‘లోటస్ పాండ్’కు సమీపంలోనే ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ గల గృహాన్ని దాదాపు 3 కోట్లు వెచ్చించి రకుల్ ప్రీత్ సింగ్ కొనుగోలు చేసిందని సమాచారం. తన కుటుంబం మొత్తం అమ్మ, నాన్న, సోదరుడులతో కలిసి ఈ ఇంటిలోనే ఉండబోతున్నారని, త్వరలోనే తన కొత్తింటిలో ప్రవేశించడానికి సిద్ధమవుతోందని టాక్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories