ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ నిద్ర లేస్తూనే జిమ్ కి వెళ్లిపోతుందని తోటి హీరోయిన్లు, రకుల్ స్నేహితురాళ్ళు రెజీనా, రాశి ఖన్నాలు చలోక్తులు వేస్తుంటారు. అయితే తనకు జిమ్ అంటే ఎందుకు అంత పిచ్చో సైంటిఫిక్ గానూ, మానసికంగానూ రకుల్ చెపుకొచ్చింది.
“తన బాడీ మెటబాలిజమ్ సరిగ్గా ఉండదని, దానిని బ్యాలెన్స్ చేసేందుకు జిమ్ లో పాట్లు పడుతుంటానని, ఇక ముఖ్యంగా తనకు చాలా త్వరగా కోపం వచ్చేస్తుందని, ఇదొక వీక్ నెస్ గా మారిందని, దీనిని నియత్రించేందుకు అయితే జిమ్ లో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటానని, ఇంతకు ముందు తనకు ఎవరి మీదైతే కోపం వచ్చిందో వారి ముఖాన్ని గుర్తు చేసుకుని కసికసిగా ప్రాక్టీస్ చేస్తానని, అయితే తనకు వచ్చిన కోపం ఎక్కువ సేపు ఉండదని, తొందరగానే పోతుందంటూ” ” ముద్దుగుమ్మ తన వీక్ నెస్ విశేషాలపై వివరణ ఇచ్చింది.
ఇక, ప్రస్తుతం తానూ నటిస్తున్న “సరైనోడు” సినిమా సంగతులను కూడా చెప్పింది రకుల్. ఈ సినిమా షూటింగుకు సంబంధించి ఒకే ఒక్కపాట చిత్రీకరించాల్సి ఉందని, అందు నిమిత్తం బొలీవియా వెళ్తున్నామని, ఈ పాట షూటింగ్ పూర్తయ్యాక ఈ నెలాఖరులో ఆడియో వేడుక, ఏప్రిల్ లో సినిమా విడుదలవుతుందని, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పి మెగా అభిమానులను ఖుషీ చేసింది రకుల్.



