చిరంజీవి సినిమాలో రామ్ చరణ్… క్లారిటీ ఇదిగో

Ram Charan cameo in chiranjeevi koratala movie-గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమా లో రామ్ చరణ్ ఒక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అలాగే లూసిఫర్ రీమేక్ లో వారిద్దరూ కలిసి కనిపించబోతున్నారని కూడా విన్నాం. అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అటువంటిది ఏమీ లేదని ఆయన కంఫర్మ్ చేశారు.

“చిరంజీవి కొరటాల శివ చిత్రంలో నేను చేస్తున్నా అనే వార్తలో నిజం లేదు. అసలు సినిమాలో నేను చెయ్యడానికి ఆస్కారం ఉన్న పాత్ర ఉందని నాకు తెలీదు. అలాగే మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రైట్స్ నేను కొన్న మాట వాస్తవమే. అయితే ఆ సినిమా నేను చెయ్యడం లేదు,” రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

చిరంజీవి – కొరటాల శివ క్రేజీ కాంబో మూవీ ముహూర్తం విజయదశమికి జరిగింది. నవంబర్ నుండి చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖ నేపథ్యంలో ఉంటుందని, గుడులు, వాటి నియంత్రణ బోర్డుల పరిపాలన మీద ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

మిర్చి సినిమాతో టాలీవుడ్‌‌లో డైరక్టర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొరటాల.. వరుసగా నాలుగు హిట్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఆయా హీరోల కేరీర్ లోనే అతిపెద్ద హిట్లుగా అయ్యాయి. దీనితో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories