ఆర్ఆర్ఆర్ వాయిదా పై రామ్ చరణ్ క్లారిటీ

Ram Charan clarifies on RRR movie release date-గత కొంత కాలంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ సినిమా జులై 30, 2020న ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా 2021 సంక్రాంతికి గానీ, వేసవికి గానీ విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు దాని మీద రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. “ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తలలో నిజం లేదు. సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారమే జరుగుతుంది,” అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకూ ఈ చిత్రం ప్రమోషన్లు మొదలు పెట్టలేదు చిత్ర నిర్మాతలు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి, మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories