రామ్ చరణ్ ‘ధృవ’ కాశ్మీర్ లొకేషన్!

Ram Charan Druva locationఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకున్న సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ ల ‘ధృవ’ సినిమా కాశ్మీర్ లోయలకు షిఫ్ట్ అయ్యింది. బహుశా ‘కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తో ఓ డ్యూయెట్ వేసుకోవడానికి వెళ్ళాడో ఏమో గానీ, కాశ్మీర్ అందాలను ఎంజాయ్ చేస్తూ హీరోయిన్ రకుల్ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

కాశ్మీర్ లో అడుగుపెట్టాం… ఇక అందాలకు మతి పోవాల్సిందే… అంటూ మెలికలు తిరుగుతూ పారుతున్న ఓ సేలయేరు చిత్రాన్ని పోస్ట్ చేసింది రకుల్. కాశ్మీర్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది… ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతంగా వీక్షించిన సందర్భాలున్నాయి. అయితే ఎన్ని సార్లు చూసినా తనివీ తీరనంత ప్రకృతి సౌందర్యం కాశ్మీర్ సొంతం. ఆ అందాల నడుమ హీరోయిన్ రకుల్ సోయగాల ప్రదర్శన ఇస్తే ఆడియన్స్ వచ్చే కిక్కే వారు కదా! అందుకే దర్శకుడు వెతికి వెతికి మరీ కాశ్మీర్ ను ఎంపిక చేసినట్లున్నారు.

ADVERTISEMENT

‘బ్రూస్ లీ’ తర్వాత వరుసగా రెండవ సారి రకుల్ ప్రీత్ సింగ్ తో చెర్రీ జోడి కడుతున్నాడు. ఇప్పటికే ‘సరైనోడు’ ద్వారా అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పే సినిమా ఇచ్చిన రకుల్, రామ్ చరణ్ కు కూడా మరో భారీ హిట్ ఇస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ‘బ్రూస్ లీ’ దారుణ పరాజయం అయినప్పటికీ మరోసారి రకుల్ కే ఓటు వేసింది ‘ధృవ’ చిత్ర యూనిట్.

ADVERTISEMENT
Latest Stories