మెగా పవర్ స్టార్ రాంచరణ్, రంగస్థలం సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అతని చెవిటి పాత్రకు అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. సినిమా హిట్ అయితే .. ఏ విదేశాలకో వెళ్లి .. ఫ్యామిలీ యాత్రలు చేసే ఇతర హీరోల్లా కాకుండా.. రామ్ చరణ్ ఎండల్లో కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. భార్య ఉపాసన తో కలిసి పార్టీలకు వెళ్లడమే కాకుండా.. సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు రాంచరణ్. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటీమణి – సుభాషిణి ( అల్లరి) కోసం రెండు లక్షలు విరాళం ఇచ్చి సహృదయాన్ని చాటుకున్నారు.
మెగా ఫామిలీ తో మంచు ఫామిలీ మంచి అనుబంధం పెంచుకుంటూ పోతున్నది. అందులో భాగంగానే, మనోజ్ పవన్ కళ్యాణ్ ని సమర్ధించడం!. ఇప్పుడు రామ్ చరణ్ ఐస్ క్రీములు అమ్మడం!. అరె .. రామ్ చరణ్ మజ్జిగ అమ్మింది, మంచు ఫామిలీ నిర్వహిస్తున్న ‘ మేము సైతం ‘ సేవా కార్యక్రమం కోసం. మంచు లక్ష్మి నిర్వహించే ఈ షో ద్వారా పేదవారికి, ఆపదలో ఉన్న వారికి.. చాలా మంది సెలెబ్రిటీలు తమ వంతు సాయం చేసారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ‘ నేను సైతం .. ప్రజలకోసం చల్ల మజ్జిగ అమ్ముతుంటాను ‘అని రామ్ చరణ్ ఠాగూర్ తరహాలో.. ‘మేము సైతం ‘ షో లో పాల్గొనడం, అభినందించదగ్గ విషయం. నాన్నలా నటించడమే కాదు.. నాన్న లా .. సేవ లో కూడా ముందున్నాడు రామ్ చరణ్. ప్లాపుల వడదెబ్బ తగిలి కొట్టుకుంటున్న రాంచరణ్ కు ‘ రంగస్థలం ‘ లాంటి కూల్ హిట్ అందించిన ప్రేక్షకులకు.. రాంచరణ్ ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడేమో?.



