రామ్ చరణ్ ఓపెన్ అయ్యారు!

Ram-Charan-Disappointsమిర్యాలగూడ వేదికగా జరిగిన ప్రణయ్ హత్యపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీవ్రంగా స్పందించారు. తన కులస్తుడిని కాదని, వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు, పరువు పోయిందని భావించిన అమృత వర్షిణి తండ్రి, తన అల్లుడు చంపించడంలో పరువు ఎక్కడుందంటూ రామ్ చరణ్ మండిపడ్డారు.

[m9ad]

ADVERTISEMENT

ఒక వ్యక్తిని చంపడంలో పరువు ఎక్కడుంది? మన సమాజం ఎక్కడికి పోతోంది? ఈ సందర్భంగా అమృత వర్షిణికి మరియు ప్రణయ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు. ప్రేమకు సరిహద్దులు లేవు, ప్రణయ్ కు న్యాయం జరగాల్సిందే అంటూ కోరారు మెగా పవర్ స్టార్.

రామ్ చరణ్ చేసిన పోస్టింగ్ ను సతీమణి ఉపాసన స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… విచారించదగ్గ సమయం.. మనం ఎక్కడికి పోతున్నాం… అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికే రామ్ వంటి యువహీరోలు, హీరోయిన్లు ఈ విషయంపై స్పందించగా, ఇందులో అగ్ర హీరో అయిన రామ్ చరణ్ కూడా తన వాయిస్ వినిపించడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories