చిత్రవిచిత్ర వేషాలతో పార్లమెంట్ లో నిరసన తెలుపుతూ ఉంటారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. రాష్ట్ర విభజన సమయంలోనైనా ఇప్పుడు రాష్ట్ర హక్కుల కోసమైనా ఆయన శైలే వేరు. అయితే ఆయన వేషధారణ జుగుప్సగా ఉంటుందని, రాష్ట్రం పరువు తీసేలా ఉంటుందని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నికైన ఇలాంటి జోకర్లను చూసి నరేంద్రమోదీ ఏపీని కూడా జోక్‌గా తీసుకుంటున్నాడేమో. వీరంతా జోకర్లకు తక్కువ..” అంటూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన తెలుగుదేశం పార్టీ పరువును వీరు జాతీయ స్థాయిలో దిగజారుస్తున్నారని మరో ట్వీట్ చేశాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ అయినా, కత్తి మహేష్ అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్క శివప్రసాద్ రెడ్డి విచిత్ర వేషధారణ వల్ల టీడీపీ ఎంపీల పార్లమెంట్ పోరాటం గురించి జాతీయ మీడియా సైతం కవర్ చేస్తుంది. రొటీన్ నిరసనలు చేస్తే ఖచ్చితంగా ఇంత పబ్లిసిటీ అయితే మాత్రం రాదు. పబ్లిసిటీ గురించి మనం కొత్తగా రాంగోపాల్ వర్మకు చెప్పేది ఏముందిలే!



