ముగ్గురు హీరోలతో యువ దర్శకుడు ‘మల్టీస్టారర్?’

Rana Daggubati - Nara Rohit multi starrer‘గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ” సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ తన తదుపరి చిత్రాన్ని మల్టీస్టారర్ గా ప్లానింగ్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కధ విన్న నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అలాగే మరో ఇద్దరు హీరోలుగా రానా మరియు నారా రోహిత్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజశేఖర్ వంటి హీరోతో 25 కోట్లతో “పీఎస్వీ గరుడవేగ” సినిమాను నిర్మించి సక్సెస్ ను అందుకోవడమే, ఈ దర్శకుడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. దానిని కొనసాగిస్తూ… తాజాగా మల్టీస్టారర్ ను ప్లాన్ చేయడంతో, టాప్ దర్శకుల జాబితాలోకి వెళ్ళడానికి చోటు సంపాదించుకోవడానికి అవకాశం చిక్కినట్లే. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ప్రవీణ్ సత్తార్ పేరు మరోసారి టాలీవుడ్ లో మారుమ్రోగడం ఖాయం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories