“రంగస్థలం” సిత్రాలు చూడండోయ్!

Rangasthalam 1985 Movie Setసుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న “రంగస్థలం” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో… ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఫోటోలు చక్కర్లు కొట్టడం సాధారణమే అయినప్పటికీ, “రంగస్థలం” షూటింగ్ పిక్స్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్నాయనే చెప్పాలి.

1985వ సంవత్సరంలో జరిగే కధ కావడంతో… నాటి లుక్ ను స్క్రీన్ పైకి తెచ్చేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడిందన్న సంకేతాలను ఈ షూటింగ్ పిక్స్ చెప్పకనే చెప్తున్నాయి. అప్పట్లో కార్ల ప్రపంచాన్ని ఏలిన అంబాసిడర్, జీబు ఫోటోలను కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. తీసుకుంటున్న జాగ్రత్తలు గమనిస్తుంటే… ఈ సారి మెగాపవర్ స్టార్ కు సుకుమార్ బంపర్ హిట్ నే అందించేలా కనపడుతున్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories