“రంగస్థలం”ను రౌండప్ చేసిన 2 సినిమాలు!

Rangasthalam 1985 Release Dateఈ ఏడాది సమ్మర్ ఫీస్ట్ రామ్ చరణ్ తేజ – సుకుమార్ ల “రంగస్థలం” సినిమాతో ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ లో విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాల కంటే ముందుగా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘రంగస్థలం’ సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను మరో రెండు చిత్రాలు రౌండప్ చేశాయన్న టాక్ టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మార్చి 30 కంటే రెండు రోజుల ముందు ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ కానున్నాయనేది లేటెస్ట్ న్యూస్.

అందులో ఒకటి… నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “ఎమ్మెల్యే” సినిమా కాగా, మరొకటి సావిత్రి జీవితచరిత్రతో తెరకెక్కుతోన్న “మహానటి” సినిమా. ఈ మూడు వేటికవే డిఫరెంట్ జోనర్స్ కు చెందిన చిత్రాలు కావడం సినీ అభిమానులకు కలిసొచ్చే అంశం. మార్చి 28న ‘ఎమ్మెల్యే,’ 29న ‘మహానటి,’ 30న ‘రంగస్థలం’ ఇలా మూడు రోజుల్లో మూడు చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సమ్మర్ సినీ బొనంజాను ఎవరు గ్రాండ్ గా ఆరంభిస్తారో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories