Rashmika Mandanna

యానిమల్, పుష్ప సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా అటు ఇండస్ట్రీ వర్గాలను ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక మందన అన్ని ఇండస్ట్రీలలో వరుస అవకాశాలను, విజయాలను సమపాళ్లలో అందుకుంటున్నారు.

2018 లో వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రష్మిక హీరో నాగశౌర్య తో కలిసి మంచి హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండ తో వచ్చిన గీతగోవిందం మూవీ తో టాలీవుడ్ క్రెజీ హీరోయిన్ గా మారిపోయి మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!

ఇక డియర్ కామ్రేడ్, భీష్మ, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, సరిలేరు నీకెవ్వరూ మూవీల విజయాలతో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పిన రష్మిక పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుని నేషనల్ క్రష్ అనే టాగ్ ను సంపాధించుకున్నారు.

ఇక యానిమల్ మూవీతో అటు నటనలోనూ తన మార్క్ చూపించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. ఇక రష్మిక మహారాణి గా నటించిన బాలీవుడ్ మూవీ చావా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక రష్మిక నేషనల్ క్రష్ నుండి నేషనల్ క్రెజ్ గా మారనున్నారు.

Also Read – కేసీఆర్‌, జగన్‌: దొందూ దొందే…

అయితే చావా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి. తనకు కథ నచ్చితే ఇద్దరు పిల్లల తల్లిగా చేయడానికైనా, బామ్మ పాత్ర పోషించడానికైనా సిద్దమే అంటూ కామెంట్ చేసారు. దీనితో హీరోయిన్ గా ఇంత పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో రష్మిక ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తనకు మూవీస్ మీద ఉన్న డెడికేషన్ కు, కథ మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు.

సందీప్ యానిమల్ మూవీ లో కూడా రష్మిక, రణబీర్ పక్కన ఇద్దరు పిల్లల తల్లిగా చేసి మెప్పించారు. అలాగే ఇపుడు కూడా నేను నటించే సినిమాలలో ఎం చేస్తున్నాను అనేది నాకు సంబంధం లేని విషయం, దర్శకుడు చెప్పిన కథ నన్ను ఆకట్టుకుంటే చాలు ఆ సినిమా చెయ్యడానికి నేను వెనకాడను అంటూ ఛాలెంజింగ్ దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రష్మిక.

Also Read – అనుభవానికి…ఆవేశానికి మధ్య గీత ఇదేనా.?


అయితే తానూ ఇప్పటివరకు అనుకోకుండా ఎంచుకున్న సినిమాలే ఎక్కువగా ప్రేక్షకుల మెప్పు పొందాయన్నారు. అలాగే ఇటు టాలీవుడ్ పాపులర్ హీరోతో ఈ అమ్మడు ప్రేమ, పెళ్లి వ్యవహారం మీద కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా గుసగుసలు నడుస్తూ ఉంటాయి. మరి ఆ గుసగుణాలకు ఎండ్ కార్డు వేయాలంటే రష్మిక పెళ్లి కార్డు చూడాల్సిందే అంటున్నారు ఈ ఇద్దరి అభిమానులు.