ప్లేట్ మార్చిన మంత్రి… నా కొడుకు నిర్దోషి… నమ్మాలా…!

ravella-kishore-clarified-on-the-case-of-son-ravella-susheel“తన కొడుకు కేసులో తన ప్రమేయం ఉండదంటూ చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు ‘ప్లేట్’ మార్చారు. ఇదంతా జగన్ రాజకీయంగా తనపై చేస్తున్న కక్ష్యపూరితమైన చర్య అని, సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పటిది కాదు అని, అది మార్ఫింగ్ చేసినదని, కేసును తప్పు దారి పట్టించేందుకు జగన్ మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని, తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తన కుమారుడ్ని బలి చేస్తోందని, చట్టాలపై తనకు విశ్వాసం ఉందని, తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తారు అన్న నమ్మకముందని మంత్రి రావెల జగన్ పై ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రంగా మండిపడ్డారు.

ADVERTISEMENT

ఈ కేసులో పరిణామాలు చాలా వేగంగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీలో ఉన్న తనయుడు ఒక్కసారిగా శనివారం రాత్రి సమయంలో పోలీసుల ఎదుట లొంగిపోవడం, ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న మంత్రి గారు ఉదయమే తన కొడుకు నిర్దోషి అంటూ వెనకేసుకు రావడం, సీసీ టీవీ ఫుటేజ్ ఇక్కడి వరకే ఉండడం, కెమెరాలు లేకపోవడం వలన మరో వీధిలో జరిగిన ఉదంతం లేదని పోలీసులు చెప్పడం వంటి విషయాలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో అన్న సందేహాలు సామాన్యుడి మదిలో మెదులుతున్నాయి.

మంత్రి తనయుడు, డ్రైవర్ పై బుక్కైన ‘నిర్భయ’ కేసులకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో మొత్తంగా కేసునే నీరుగారుస్తారా? లేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఆ యువతికి న్యాయం జరుగుతుందా? ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల విషయంలో మన దేశంలో జరుగుతున్న “న్యాయం” పట్ల బహిరంగ విమర్శలే చాలా ఉన్నాయి. దీంతో మంత్రి గారి పుత్రరత్నం ఉదంతానికి “క్లైమాక్స్” ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories