ఇటువంటి చిల్లర రాజకీయం ఊహించలేదు… జనసైనికుల ఆవేదన

ravella-kishore-joins-jansenaమాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు జనసేన పార్టీలో చేరారు. కాసేపటి క్రితం ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమక్షంలో రావెల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల ముందు పార్టీని వీడిన మొదటి అధికార పార్టీ ఎమ్మెల్యే రావెల కావడం విశేషం. ఈక్రమంలో రావెల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దళితులంటే చులకన అని, ఆ పార్టీలో పదవులు ఇస్తారుగానీ అధికారం ఇవ్వరని చెప్పుకొచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

ఎంతో ఉన్నత ఆశయాలతో రాజకీయాలలోకి వచ్చిన తాను తెలుగుదేశం పార్టీలోని కుల, డబ్బు, మద్య రాజకీయంలో ఇమడలేకపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రావెల తన పదవినుండి తాను తప్పుకోలేదు. తప్పించబడ్డారు. అందుకే ఆయన పక్క పార్టీ వైపు చేశారనేది జగమెరిగిన సత్యం. ఇటువంటి క్రమంలో జనసేన మాత్రమే నాకు ప్రత్యామ్న్యాయంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ ఆశయాల సాధన గురించి చెప్పిందే చెప్పి దంచిన రావెల ఒక ఆడపిల్లను వేధించడం కెమెరాలో చిక్కినా ఎందుకు వెనకేసుకొని వచ్చి కాపాడారో చెబితే ఇంకా బావుంటుంది.

జనసేన మాత్రమే కొత్త ఒరవడి సృష్టించగలదు అని చెప్పిన ఆయన ముందు వైకాపాలోకి వెళ్ళడానికి ప్రయాణించలేదా? మరోవైపు రావెల చేరికపై జనసేనలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కడుపు తీపితో ఒక ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని ఆయన లాంటి వారిని పార్టీలో చేర్చుకుని మనం ప్రజలకు ఏం చెప్తామని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే పవన్ మాత్రం తన స్పీచ్ లో ఆ అంశం కనీసం ప్రస్తావించకుండా రావెలను అంబెడ్కర్ స్థాయికి ఎత్తేశారు. పవన్ నుండి ఇది అసలు ఊహించని రాజకీయమిదని సొంత అభిమానులే అంటున్నారు.

రేపటినుండి మేము సాధారణ రాజకీయ పార్టీల మాదిరి కాదు అని ఎలా చెప్పుకుని తిరుగుతాం అని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏమిటంటే అటు చంద్రబాబు ఇటు జగన్ నిర్వహించిన రెండు సర్వేలలోనూ రావెల ఈసారి పోటీ చేస్తే ఆయన పోటీ చేసిన పార్టీ మూడో స్థానంలోకి పడిపోవచ్చు అని వచ్చిందట. అందుకే రావెలను తెలుగు దేశం ఎప్పటినుండో పక్కన పెట్టింది. జగన్ అయితే వస్తాను అన్నా సరే చేర్చుకోలేదు. అటువంటి వారిని ఇంతగా మోసి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏంటని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories