‘బ్లాక్ బస్టర్’ మూవీని మిస్ అయ్యాను!

Ravi Teja missed 2  movie in Anil Ravipudi Directionఇండస్ట్రీలో హిట్ ఫార్ములా అంటూ ఏది లేదు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అలా అంచనాలు వేయలేక చాలా మంది హీరోలు ‘బ్లాక్ బస్టర్’ కధలను తృణప్రాయంగా వదులుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆ కోవలోనే తాజాగా మరో కధ వెలుగులోకి వచ్చింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన “రాజా ది గ్రేట్” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో… ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా మీడియా వర్గాలకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ADVERTISEMENT

ఆ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా “పటాస్” సినిమా గురించి షాకింగ్ విషయం చెప్పారు. ఈ సినిమాను తొలుత తానే చేయాల్సి ఉందని, కేవలం సిల్లీ కారణాలతో ఆ సినిమాను వదులుకున్నానని చెప్పడంతో… మాస్ మహారాజాకు మాంచి బ్లాక్ బస్టర్ మిస్సయ్యిందే అనుకోవడం అభిమానుల వంతయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “పటాస్” అదిరిపోయే హిట్ అయిన విషయం తెలిసిందే. అదే సినిమాను రవితేజ చేసుంటే మరో రేంజ్ కు వెళ్ళేదేమో మరి!

ఇలా ఒక హీరో వదిలేసిన కధలలో వేరే హీరోలు నటించడం అనేది సినీ పరిశ్రమలో చాలా సహజం. అయితే ఈ సంగతులు బయటకు రానంత వరకు బానే ఉంటుంది. కానీ ఒక్కసారి అధికారికంగా వెల్లడైన తర్వాత అభిమానుల మధ్య చర్చలు, వాగ్వివాదాలు అనేవి చాలా రొటీన్. ‘పటాస్’ మిస్సయినా, ‘రాజా ది గ్రేట్’ సినిమాను మాత్రం మిస్ కాలేదు, ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే అదరగొడుతుందన్న నమ్మకాన్ని మాస్ మహారాజా వెలిబుచ్చారు. మరి రవి నమ్మకం ఎంతవరకు సాకారం అవుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories