Ravi Teja Mass Jathara Glimpse

మాస్ మహారాజ రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ మొదలుపెట్టారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం, ఆయన పుట్టిన రోజు కూడా. కనుక మాస్ జాతర గ్లింమ్స్‌ విడుదల చేశారు.

రవితేజ ఓ మాస్ హీరో.. కనుక మాస్ జాతర చేస్తున్నాడు. కనుక ఇది కూడా ఊరమాస్‌గానే ఉంది. దీనిలో రవితేజ మార్క్ యాక్షన్ చూపారు.

Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?

ఇవాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇది అభిమానులకు ఆయన ఇస్తున్న గిఫ్ట్ అనుకోవచ్చు. కానీ ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు, రవితేజ ఇంకా ఎంతకాలం ఈ మాస్ వేషాలతో కాలక్షేపం చేస్తారు?ఓ మంచి నటుడుగా నిరూపించుకునే పాత్రలు ఎప్పుడు చేస్తారు? అసలు చేస్తారా చేయరా?అనే సందేహం కలుగుతుంది.

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన జగపతిబాబు, హీరోల పక్కన కామెడీ సీన్లకు పరిమితమై ఉండే సునీల్ వంటి నటులు, ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. బాలయ్య కూడా ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రలు, కధలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..

కానీ 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న రవితేజ మాత్రం ఇంకా మాస్ హీరోగానే కాలక్షేపం చేస్తున్నారు. మాస్ మహరాజ్ బిరుదు ఆయనకు చాలా గర్వంగా ఉండవచ్చు. కానీ అదే ఆయనని ఆ మాస్ చట్రంలో బందించి ఉంచుతోందని గ్రహిస్తే తప్పకుండా దాని నుంచి బయటపడగలరు.

లేదంటే రవితేజ కూడా జగపతిబాబు, సునీల్‌లా అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ చేయాల్సిరావచ్చు. తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు తనని ఈవిదంగా కాక ఓ గొప్ప నటుడుగా గుర్తుపెట్టుకోవాలని రవితేజ కోరుకుంటే తప్పకుండా మంచి పాత్రలు, కధలు ఎంచుకోవచ్చు. లేకుంటే జీవితాంతం మాస్ సినిమాలు, మాస్ పాత్రలు చేస్తూ వాటితోనే అనేక ఫ్లాపులు వెనకేసుకున్న ఏకైక హీరోగా రవితేజ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

Also Read – జగన్ ‘పరామర్శ’ యాత్ర…!


కనుక వచ్చే పుట్టిన రోజునాటికి రవితేజ ఈ బిరుదు దాంతో వచ్చిన ఈ మాస్ భారం వదిలించుకొని చక్కటి సినిమాతో మన ముందుకు రావాలని కోరుకుందాం.