పోలవరం ప్రాజెక్టులో తనకు భారీగా నష్టం వచ్చిందని, ప్రాజెక్టుకు సంబందించి వ్యయం బాగా పెరిగిపోవడం వల్ల నష్టం వచ్చిందని టిడిపి ఎమ్.పి రాయపాటి సాంబశివరావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధానికి తగు నిదులు ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపణ తెలిపారు.
కాంగ్రెస్ టైమ్ లో తనకు ఈ కాంట్రాక్టు వచ్చిందని ఆయన వివరించారు. ఐతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ను హ్యాండల్ చెయ్యగలిగే సత్తా ట్రాన్ స్ట్రాయ్కి లేకనే నిర్మాణం ఆలస్యం అవుతుందని విస్తృత అభిప్రాయం. అనేక విధాలుగా ప్రయత్నించిన పిదప ఈ కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ నుంచి రద్దు చేసి, వేరే కంపెనీకి ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు.
దానిపై రాయపాటి కేంద్ర ప్రభుత్వంలోని పలువురిని కలిసి రద్దు అవ్వకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఐతే నష్టం తెచ్చే ప్రాజెక్ట్ పై ఆయనకు అంత ప్రేమ దేనికో? దానిని పొనిచ్చి వేరే పనులు చేసుకుంటే మెరుగు కదా! కొన్ని కొన్ని ప్రశ్నలకు రాజకీయాల్లో జవాబులు ఉండవు!


