ప్యాకేజీ కి అమ్ముడుపోయిందా? పదవికి లొంగిపోయిందా?

YS-Sharmila-Immaturity

ఒకరిపై నిరాధారమైన నిందలు మోపితే వాటికీ ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని పెద్దలు అంటుంటారు.ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు రాజన్న బిడ్డ షర్మిల.రాజకీయ పార్టీ పెట్టాం కదా పక్క పార్టీల నేతలపై ఏదొక నింద వేసి తమ రాజకీయ పబ్బం గడిపేసుకుంటే పనైపోద్ది అనుకునే రోజులు కాదు ఇవి.

ఒక మాట జారితే అనేవాడు మరిచిపోయినా, పడినవాడు వదిలేసినా సోషల్ మీడియా మాత్రం నిన్ను వదల బొమ్మాళి అన్నట్టు అవసరమైన సందర్భంలో ప్రత్యేక్షమవుతుంది. గతంలో ఏపీ రాజకీయాలలో అన్న జగన్ పెట్టిన వైసీపీ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్న షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూ టాప్ ట్రేండింగ్ లో నిలిచాయి.

ADVERTISEMENT

వైస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసి పార్టీని వరుసగా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తెస్తే, ఆయన మరణాంతరం వైస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కేసుల పేరుతో హింసిస్తుందని కాంగ్రెస్ పార్టీ పై పెద్దఎత్తున విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి తానూ కూడా పోటీనుంచి తప్పుకుని మరి, తనను నమ్ముకున్న నాయకులను నట్టేటముంచి సంపూర్ణ మద్దతు తెలిపింది,కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనానికి సిద్దపడింది.

ఇప్పుడొక్కసారి ఒక్కసారి గతంలో షర్మిల చేసిన విమర్శల విషయానికి వస్తే….,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తన రాజకీయ పదవి కోసం పార్టీని నమ్ముకున్న నేతలను, చిరు అభిమానులను నట్టేటముంచి చిరంజీవి తన వ్యక్తిగత లబ్దికోసం పార్టీని గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నాడని విమర్శించింది.

ఇప్పుడు ysrtpని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి షర్మిలకు ఎంతమొత్తం దక్కిందో, ఏరేటుకట్టి తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముతున్నారో, ఏ రాజకీయ పదవి ఆశించి పార్టీని నమ్ముకున్న వారిని నట్టేటముంచడానికి సిద్దమయ్యారో చెప్పాలంటూ అటు మెగా ఫాన్స్, ఇటు జనసైనికులు షర్మిలను సామాజిక మాద్యమాలలో ఒక ఆట ఆడుకుంటున్నారు.

అలాగే 2014 ఎన్నికలలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు బలమైన, సమర్థవంతుడైనా, అనుభవం ఉన్న నేత అవసరమని భావించి పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎన్నికల బరిలో నిలపకుండా రాష్ట్ర క్షేమం ఆశించి బేషరతుగా టీడీపీ – బీజేపీ కూటమికి తన మద్దతు తెలిపి అప్పటి ప్రభుత్వ ఏర్పాటులో తనవంతు బాధ్యత నిర్వహించాడు.

పవన్ తీసుకున్న నిర్ణయంతో తన పదవి కాంక్ష నెరవేరలేదన్న అక్కసుతో పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి అమ్ముడుపోయాడు అంటూ అప్పుడు మొదలుపెట్టిన ప్రచారం ఇప్పటికి కొనసాగిస్తున్నారు జగన్ అండ్ కో.జగన్ నాయకత్వంలో 2014 తెలంగాణ ఎన్నికల బరిలో తన వైసీపీ పార్టీని నిలిపి అక్కడ ఒక ఎంపీ స్థానాన్ని, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న జగన్ తనను, తన పార్టీని నమ్మి నిలబడిన నాయకులను, తెలంగాణ ప్రజలను కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టడానికి ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో చెప్పాలంటూ జనసైనికులు ప్రశ్నల దాడిని కొనసాగిస్తున్నారు.

అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే కొన్ని వేల కోట్ల ఏపీకి సంబందించిన ఆస్తులను ఒక్క సంతకంతో తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేయడానికి కేసీఆర్ దగ్గర ఎంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారో, ఏపీ ప్రజలను ఎలా మోసంచేశారో కూడా చెప్పాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మరొకసారి షర్మిల గత విమర్శల విషయానికి వద్దాం..,పవన్ అంటే ఎవరు చంద్రబాబు అనే దర్శకుడి దగ్గర పనిచేసే ఒక యాక్టర్ అన్నారు షర్మిల.

తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకుంటే తమ్ముడు పవన్ పార్టీ పెట్టి పోటీ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నాడు.తన పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గాలికొదిలేసి బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం ఆరాటపడుతున్నాడు అంటూ చేసిన విమర్శలు ఇప్పుడు తిరిగి తనముందుకే వచ్చి ఆగాయి.

అన్నేమో పార్టీని అమ్ముకున్నాడు, తమ్ముడేమో తనను తానే అమ్ముకున్నాడు అన్నకు తగ్గ తమ్ముడు అంటూ ఎద్దేవా చేసిన షర్మిల విమర్శలు ఇప్పుడు నెట్టింట ప్రత్యేక్షమయ్యాయి. ఇక జనసైనికులు ఖాళీగా ఉంటారా మరి…షర్మిలక్క ఎంత ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి అమ్ముడుపోయిందో అంటూ ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు.

బై బై బాబు అంటూ పక్క పార్టీలకు నినాదాలిస్తే ఇప్పుడు నీ పార్టీకే బై బై చెప్పుకునే పరిస్థితి వచ్చిందా చెల్లమ్మ అంటూ టీడీపీ అభిమానులు కూడా జనసైనికులకు తమవంతు సాయం చేస్తున్నారు. ఇదే అమ్మ మీ అన్న చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటే అంటూ మొత్తానికి షర్మిలను ఒకరేంజ్ లో ఏసుకుంటున్నారు జగన్ వ్యతిరేకవాదులంతా.అన్నరాజకీయాల కోసం చెల్లెలు బలి అంటే ఇదేనేమో.

ADVERTISEMENT
Latest Stories