వైసీపీ పాలనలో కీలక పదవులన్నీ ఆ సామాజికవర్గానికే

bhumana-karunakar-reddy-sonవైసీపీ అన్ని కులాలు, మతాలవారికీ సమాన ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పుకొంటారు. అయితే అందరూ సమానమే కానీ కొందరు అధిక సమానమన్నట్లు, పార్టీలో, ప్రభుత్వంలో, కార్పొరేషన్లలో కీలక పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే కట్టబెట్టేస్తూ, కొన్ని పదవులను మిగిలిన వర్గాలకు ఇస్తుంటుంది. కానీ వారి గొంతు వినిపించనీయదు. ఒకవేళ వినిపించాలనుకొంటే అది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను తిట్టిపోయడానికి, అవహేళన చేయడానికి మాత్రమే పరిమితం.

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వం అమరావతిపై కులం ముద్ర వేసి దానిని పాడుబెట్టేసింది. టిడిపి హయాంలో అన్ని పదవులు కమ్మవారికే కట్టబెట్టేశారని జగన్‌ ఆరోపించారు. కనుక ఆయన అందరికీ సమానావకాశాలు కల్పిస్తారనుకొంటే రాష్ట్రంలో రెడ్డిరాజ్యం స్థాపిస్తున్నారు.

ఇందుకు తాజా ఉదాహరణగా రెండుసార్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగియగానే ఆయన స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. తిరుపతి ఈవోగా ధర్మారెడ్డి చాలా కాలంగా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే.

కరుణాకర్ రెడ్డి ఇదివరకు రెండుసార్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్‌లో డెప్యూటీ మేయర్‌గా ఉన్నారు. తనకు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తే వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పుకొని కరుణాకర్ రెడ్డి ఆ పదవి పొందారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి నియోజకవర్గం టికెట్‌ తన కొడుకు అభినయ్ రెడ్డికి ఇవ్వాలని జగన్‌ను కోరగా అందుకు ఆయన ఒకే చెప్పిన్నట్లు తెలుస్తోంది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ పదవికి నష్టపరిహారమన్నట్లు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి పొందడంతో ఆయన టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడుగా ఉండే అవకాశం కూడా లభిస్తుంది. వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్‌ ఖరారు చేస్తున్నట్లు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమితులయ్యారు.

ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో అన్ని కీలక పదవులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారినే నియమిస్తూ రాష్ట్రంలో రెడ్డి రాజ్యస్థాపన చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories