“పులివెందుల పరిసర ప్రాంత వాసులకు చేపలు, రొయ్యలు… ఇది నిజంగా పులివెందులలో నేను ఏ పొద్దు అనుకోలేదు, పులివెందులలో చేపలు, రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయని, బహుశా ఎవ్వరం కూడా ఊహించి ఉండం!” – పులివెందుల వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
కడప జిల్లా విస్తృత అభివృద్ధి పధకాలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి. కట్ చేస్తే… సోషల్ మీడియా నిండా జగన్ గారి పులివెందుల వ్యాఖ్యలే. ఎవరికి తోచిన రీతిలో వారు, ఈ పులివెందుల చేపలు, రొయ్యల పొద్దులను ట్రోల్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఆ క్రమంలో రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ కూడా జగన్ వీడియోను పోస్ట్ చేస్తూ తనదైన ఎటకారాన్ని పండించారు. ‘అదేదో సినిమాలో హైదరాబాద్ కు సముద్రం తీసుకొస్తా అని హామీ ఇస్తుంటే హీరో కళ్ళల్లో ఇదే ఉత్సాహం చూసా! మళ్ళీ ఇప్పుడే చూడడం!” అంటూ జగన్ దరహాసంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే ఆర్ఆర్ఆర్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ… “జగనన్న ఫిష్ ఆంధ్ర షాప్స్ ప్రకటించేటపుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిలో కనపడుతోన్న గర్వాన్ని, ఉత్సాహాన్ని చూడండి, ఒక్క జగన్ గారు మాత్రమే ఇలాంటి అద్భుతాన్ని సాధించగలరు, రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి గర్విస్తోంది సర్” అంటూ తనదైన గోదావరి ఎటకారపు వినోదాన్ని అందించారు.
ఇక నెటిజన్లు చేసే సందడి అయితే మామూలుగా లేదు. చంద్రబాబు అపోలో టైర్స్ తెస్తే, జగనన్న అపోలో ఫిష్ తెచ్చారని, బాబు కియా అంటే, జగన్ కోరమీను అంటున్నారని, బాబు సన్ రైజ్ అంటే జగన్ సొరచేప… ఇలా ఒకటేమిటి వేల కొలది మేమ్స్ సోషల్ మీడియాను చుట్టుముట్టేసి నెటిజన్లను వినోదంలో ముంచుతున్నాయి.
https://twitter.com/satyaanagani/status/1474394065886060544?s=21
Look at our Hon’ble CM Jagan sir’s pride and joy while announcing Jagananna Fish Andhra shops 🐟 🦐 at Pulivendula. Only Jagan sir can achieve these great tasks. The state feels proud of you CM sir.👏 pic.twitter.com/wfQXOQPPkh
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) December 24, 2021
—



