లాభదాయక పదవులను నిర్వహించినందుకు గాను 20 మంది ఆప్ శాసనసభ్యులపై అనర్హత వేటువేస్తూ కేంద్రం జారీచేసిన ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించిన తెరాస ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్, గవర్నర్ ను కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించిందని, అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారని రేవంత్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం నిజంగానే చర్య తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.
ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ విచిత్ర సమస్యను ఎదురుకుంటుంది. ఉపఎన్నికలు వస్తే ఎదురుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం చెయ్యట్లేదు ఆ పార్టీ కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కు ఇబ్బందే.



