దీపావళికి జగన్కు రేవంత్ రెడ్డి గిఫ్ట్

Not So Attractive Offer for Revanth Reddy in Telangana Congress?తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ కూడా అదే ఇండికేషన్ ఇచ్చాడు. ఆంధ్ర తెదేపా నాయకులు తెలంగాణా గవర్నమెంట్తో కుమ్మక్కు అయ్యి కాంట్రాక్ట్‌లు పోందుతున్నారని రేవంత్ ఆరోపించారు కూడా.

రానున్న రోజుల్లో ఈ ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రాలుగా వాడుకోబోతుంది. రేవంత్ చంద్రబాబును ఏమీ అనక పోయినప్పటికీ చంద్రబాబుకు తెలిసే ఇవన్ని జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించబోతుంది. ఒకరకంగా రేవంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు అస్త్రాలు అందించాడు.

ADVERTISEMENT

మరో వైపు జంప్ జిలానీల సెగ చంద్రబాబుకు కూడా తగలడంతో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి బాగా ఆనందంగా ఉన్నట్టు సమాచారం. గత ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 20 మంది ఎంఎల్ఏలను, ఇద్దరు ఎంపీలని పోగొట్టుకుంది. నిన్నగాక మొన్న మరో ఎంపీ సైకల్ ఎక్కారు.

మరింత మందితో చంద్రబాబు టచ్లో ఉన్నారని సమాచారం. ఇలాంటి సమయంలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణాలో దెబ్బ తినడం ఒకరకంగా జగన్ కు ఆనందమే. పైగా చంద్రబాబు మీద త్రాచు పాము పగ వంటిది జగన్ పగ. ప్రజాస్వామ్యం, కోర్లు లేకపోతే చంద్రబాబును ఏంచేస్తారో జగన్ ఆల్‌రెడీ నాంధ్యాలలో చెప్పారు కూడా. కాబట్టి తెలంగాణాలో జరుగుతున్న ఈ పరిణామాలు జగన్కు ఆనందం కలిగించేవే.

ADVERTISEMENT
Latest Stories