రేవంత్రెడ్డిని ఢిల్లీ తీస్కుని వెళ్ళింది ఎవరు? తెదేపాను ఖాళీ చేస్తాడా?

టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి డిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కొన్ని రోజుల క్రితం కలిసారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రేవంత్ను ఢిల్లీ తీస్కుని వెళ్లారని సమాచారం. ఆయనే రేవంత్ రెడ్డిని ప్రోత్సహించినట్టు సమాచారం.

ADVERTISEMENT

రాహుల్ గాందీ తో రేవంత్ తనకు ఏ పదవి అనేది కాదని, తనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారట. మిగిలిన విషయాలు తనకు వదిలేయాలని, మీరు పార్టీకి విస్తారంగా పనిచేయండని రాహుల్ గాంధీ సలహా ఇచ్చారట. మీ ప్యూచర్ మేం చూసుకుంటాం అని కూడా రాహుల్ భరోసా ఇచ్చారట. రేవంత్ పాదయాత్ర చేస్తానని చెప్పగా, ఏ కార్యకర్మం చేపట్టినా ఫర్వాలేదని అన్నారని అంటున్నారు.

పదహారు జిల్లాల తెదేపా అద్యక్షులు కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలలో కూడా కొందరు కాంగ్రెస్ లోకి రావచ్చని అంటున్నారు. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని రేవంత్ వర్గంవారు అంటున్నారు.

తొందరలొనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు, ఆలోగానే రేవంత్ చేరికా ఉండొచ్చని పుకార్లు షీకరు చేస్తున్నాయి. తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. సమావేశానికి హాజరైన రేవంత్‌ రెడ్డి. ఈ సమావేశం లోనే రేవంత్ తన నిర్ణయం చెప్పావొచ్చు అని సమాచారం

ADVERTISEMENT
Latest Stories