ఎన్నికల్లో పరాజయం పొందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్లమెంట్ వైపు చూస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీ వల జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రేవంత్‌రెడ్డి ఓటమి చెందారు. ఆయన ఓటమి చెందడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నష్టం జరిగింది. రేవంత్‌రెడ్డి ఓటమి కూడా కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నారు.
[m9ad]
అందుకే అవకాశం వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు రేవంత్. రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఒకవేళ అక్కడ అవకాశం లభించకుంటే మరే ఇతర స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే కొడంగల్ కు దూరం జరిగితే రాజకీయంగా నష్టం కలగవచ్చని ఆయన మహబూబ్ నగర్ లోనే పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇదే జరిగితే రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని రిస్క్ లో పెడుతున్నట్టే.
అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ అంటే రేవంత్ రెడ్డి సొంత బలం మీద నడుస్తుంది అయితే పార్లమెంట్ లో పోటీ చెయ్యలాంటి మొత్తం పార్టీలోని ఇతర నాయకులు కూడా సహకరించారు. ఇప్పటికే పార్టీలోని సీనియర్లకు రేవంత్ అంటే పొసగడం లేదు. గత ఎన్నికలలో ఈ సీటు నుండి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ టిక్కెట్టుపై సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. నాగం మళ్ళీ ఇదే స్థానం నుండి పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు.
మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంట్ కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. మొత్తం అన్ని సీట్లు తెరాస ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ నుండి పోటీ అంటే అంత తేలిక కాదనే అర్ధం అవుతుంది. తెరాస నుండి మరోసారి గత ఎన్నికలలో గెలిచిన జితేందర్ రెడ్డినే పోటీ చెయ్యబోతున్నారు. ఆయన ప్రస్తుతం లోక్ సభలో తెరాస ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



