ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలే!

Richa Chadha On Harassment In Bollywood“ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పేరు ప్రఖ్యాతుల కోసం సూపర్ స్టార్లు, క్రికెటర్లతో సంబంధాలు పెట్టుకోవాలని ఒకరు సూచించారంటూ” ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపింది. “నేను ఇండస్ట్రీలో అడుపెట్టాక పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించి, ఆ హీరోతో డేటింగ్ చేయమని కోరాడు. అతనికి పెళ్లయింది కదా?” అని ప్రశ్నిస్తే ఓ క్రికెటర్ పేరు చెప్పి అతనికి మెసేజ్ ఎందుకు పంపించకూడదు? అని ఎదురు ప్రశ్నించినట్లుగా చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

“మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని అతడు తనకు సలహా ఇచ్చాడని, అయితే తానెప్పుడూ డేటింగ్ జోలికి వెళ్లలేదని” పేర్కొంది. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని, తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలి కానీ, అవి ఈ తరహావి మాత్రం కాకుడదంటూ చెప్పుకొచ్చింది.

ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టిగా, అనురాగ్ కశ్యప్ చిత్రం ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా రిచా నటించిన ‘జియా ఔర్ జియా’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో… పాల్గొన్న ప్రమోషన్ కార్యక్రమాలలో సదరు సంగతులన్నీ పబ్లిసిటీలో భాగంగా వెలిబుచ్చింది.

ADVERTISEMENT
Latest Stories