rohit-sharma-and-virat-kohli Ranji Trophy

తాజాగా గ్రౌండ్ లో టీం ఇండియా ప్రదర్శన చూసుకుంటే, అనుకున్న స్థాయి లో కాదు కదా, ఏ భారత అభిమాని కనీసం ఊహల్లో కూడా అనుకోని స్థాయిలో ఉంది. సొంత గడ్డ పై 3 -0 తో వైట్ వాష్ తో, బీ.జీ.టీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడ కూడా ఘోర ఓటమి భారాన్ని మోసుకొచ్చారు.

అయితే, ఈ ఓటములతో కంగుతిన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా ముందుకు వచ్చి, భారత జట్టులో తమ చోటు పదిలంగా ఉండాలంటే, ఏ ఆటగాడైన డొమెస్టిక్ లెవెల్ లో బాగా రాణించాలంటూ ఆదేశించారు. దీనితో ఇక రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి డొమెస్టిక్ లీగ్లకు ప్రాధాన్యత ఇస్తుంది బోర్డు.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

ఇదిలా ఉంటే ఈ రెండు సిరీస్ ఓటములకు మూల కారణం జట్టులో సీనియర్ ఆటగాళ్లే అని అభిప్రాయం సర్వత్రా వినిపడుతుంది. విరాట్-రోహిత్ లు తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోవడం వల్లనే భారత్ టీం కు ఈ స్థాయి అపజయాలు ఎదురవుతున్నాయంటూ క్రికెట్ ఎనలిస్టులు అభిప్రాయం పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఇరువురు మళ్ళీ టెస్ట్ లలో తమ మునుపటి ఫామ్ ను అందుకోవాలంటే దేశవాళీ టోర్నీలలో ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం అటు క్రికెట్ వర్గాలతో పాటుగా ఇటు టీం సభ్యులు కూడా భావిస్తున్నారు.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?

మరి అటు చూస్కుంటే, రోహిత్ శర్మ చివరిగా ఈ దేశవాళీ టోర్నీలు ఆడి దాదాపు ఒక దశాబ్దం అవుతుంది. 2015 లో ఆయన రంజీల్లో కనపడగా, మళ్ళీ పదేళ్ల తరువాత రంజీల్లోకి రానున్నారని టాక్. ఇటు చూస్తే, విరాట్ దేశవాళీ టోర్నీల్లో దర్శనమిచ్చి ఏకంగా పుష్కర కాలం గడిచింది. 2012 రంజీల్లో ఈయన చివరిగా ఢిల్లీ తరపున ఆడారు.

అయితే గంభీర్ చేసిన వ్యాఖ్యలు కేవలం సీనియర్ ఆటగాళ్లకు కాదు, జూనియర్స్ కు కూడా ఇది ఒక అలెర్ట్ వంటిది. జైస్వాల్, పంత్, నితీష్ వంటి అప్ కమింగ్ ఆటగాళ్లు కూడా ఇప్పడు జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే, తిరిగి రంజీల్లో దర్శనమివ్వాలని చూస్తున్నారు. పంత్ ఇప్పటికే తాను రంజిలకు అందుబాటులో ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చేసారు.

Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!


విరాట్, పంత్ ఇద్దరు ఢిల్లీ కు చెందిన ఆటగాళ్లే! రోహిత్ నిన్ననే రంజీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. పంత్ తాను అందుబాటులో ఉన్నట్లు క్లారిటీ ఇవ్వగా, ఇంకా విరాట్ కోహ్లీ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. చూడాలి మరి, మన సీనియర్ ఆటగాళ్లంతా తమ దృష్టిని రంజీ ట్రోఫీ వైపు మళ్లించి తమ మునపటి ఫామ్ ను తిరిగి అందుకుంటారా అనేది.