రోజా ‘ట్విస్ట్’ ఇచ్చింది… ‘సారీ’ చెప్పలేదని తేల్చింది..!

Roja finally gives up, asks for apologyప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన రోజా టిడిపి ఎమ్మెల్యే అనితకు సారీ చెప్పినట్లుగా ప్రసారం చేసిన వార్తలను రోజా ఖండించారు. ‘అనితను కించపరిచే వ్యాఖ్యలు తానేమీ చేయలేదని, ఒకవేళ తన మాటలు అనితను భాదించి ఉంటే, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మాత్రమే తాను చెప్పానని, అలాగే అసెంబ్లీ ఫుటేజ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయని తాను కమిటీని ప్రశ్నించానని, టిడిపి నేతలు తనపై చేసిన వ్యాఖ్యలకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా తాను అడిగినట్లుగా” రోజా చెప్పడం విశేషం.

ADVERTISEMENT

అయితే అంతకు ముందు మీడియాతో వ్యాఖ్యానించిన ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ… రోజా సారీ చెప్పినట్లుగా తెలిపారు. అలాగే పూర్తి నివేదికను స్పీకర్ కు అందజేస్తానని అన్నారు. మరి కమిటీ సభ్యుడి వ్యాఖ్యలకు, రోజా చెప్పిన మాటలకు పూర్తి వ్యత్యాసం అగుపిస్తుండడంతో ఎవరి మాటలను విశ్వసించాలి అన్నది అయోమయంగా మారింది.

అయితే కమిటీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు తదుపరి క్రమంలో అక్షర రూపం సంతరించుకునే అవకాశం ఉండడంతో మీడియా ముందు కూడా తప్పు దోర్లించడానికి ఆస్కారం లేదు. మరి నేపధ్యంలో కమిటీ ముందు తన తప్పును ఒప్పుకున్న రోజా మీడియా ముందు డాంభికం ప్రదర్శిస్తోందా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories