గుడ్ న్యూస్… మరో సినిమాలో పవన్..?

rumours-pawan-kalyan-next-with-am-ratnamఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసినట్టేననీ, అందుకే తాను సినిమాలలో నటించినని స్వయంగా చెప్పిన పవన్, మళ్లీ ఆలోచనలో పడ్డారా అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. గతంలో కొన్ని బ్యానర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు పవన్ దగ్గర ఉండిపోవడం మరింత బలాన్నిస్తోంది. ఎన్నికలకు ఇంకాస్త సమయం వుంది కనుక, ఒక సినిమా చేయవచ్చనే ఆలోచనలో పవన్ వున్నాడనది లేటెస్ట్ టాక్.

ADVERTISEMENT

పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన బ్యానర్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ పేరు కూడా వుంది. అందువలన వాళ్లకి ఒక సినిమా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ మాత్రం ఎ.ఎం.రత్నం ప్రాజెక్టుపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. గతంలోనే ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా చేస్తే, ఆ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు.

ఇక ఎ.ఎం.రత్నం బ్యానర్లో పవన్ చేస్తే దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ ఈ రెండు బ్యానర్స్ లో ఎవరితో చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఎవరితో సినిమా చేసినా అది మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్ మొదటి వారంలో గాని మొదలవుతుందని అంటున్నారు. ఎవరిది చేసినా పర్లేదు ఒక సినిమా చేస్తే చాలు అంటున్నారు ఫ్యాన్స్.

ADVERTISEMENT
Latest Stories