వరసకు బావమరదళ్ళు అయిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు మరియు నాగబాబు తనయురాలు నిహారికకు త్వరలో మనువు జరగబోతోంది అంటూ చెలరేగిన ఓ వార్త ట్రేడ్ వర్గాలలో సంచలనంగా మారింది. సహజంగా ఇలాంటి వార్తలపై ‘సైలెంట్’గా ఉండే మెగా కాంపౌండ్ నుండి అప్పుడే వివరణ రాదనుకున్న తరుణంలో… అస్సలు ఇందులో ఒక్క శాతం కూడా నిజం లేకపోవడంతో, హీరో సాయిధరమ్ తేజ్ స్పష్టత ఇచ్చారు.
నిహారికకు తనతో వివాహం అంటూ వస్తున్న వార్తల్లో అసలు వాస్తవం లేదని సాయి వీటిని ఖండించారు. నిజానికి ఈ పుకార్లతో తాను కలత చెందానని, నిహారిక, తాము అంతా ఒకే కుటుంబంలో పెరిగామని, నిహారికతో తన అనుబంధం సోదరిలాగా ఉంటుందే తప్ప, మరోలా కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన ఇలాంటి వార్తలను ప్రచురించేటపుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.
ఇలాంటి బేస్ లెస్ కధనాలు తమ మనోభావాలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేసారు సాయి. అయితే ఇలాంటి వార్తలను పూర్తిగా డ్యామేజ్ కాకముందే ఖండించినందుకు సాయిని అభినందించి తీరాల్సిందే. అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలపై ఉండే క్రేజ్ రీత్యా, ఇవి తక్కువ సమయంలోనే ఎక్కువగా సర్క్యూలేట్ అవుతుంటాయి. అయినప్పటికీ… సాయి కాస్త త్వరగానే స్పందించినట్లు చెప్పుకోవాలి.



