
ట్రెండ్ కి తగ్గట్టుగా తమ అభిరుచులను, ఇష్టాఇష్టాలను మార్చుకోవడం సర్వ సాధారణమైన అంశమే, అందునా ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లాంటి సినీ రంగంలో ఈ ట్రెండ్ల గోల మితి మీరు ఉంటుంది.
అలా ట్రెండ్ తో పాటుగా తమ వేషధారణ, సినిమాల ఎంపికను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నటీనటులు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ట్రెండ్ ఎటు వైపున్న ప్రేక్షకులను మాత్రం తన వైపు తిప్పుకోగలుగుతున్న నటి సాయి పల్లవి మాత్రమే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
ఇదే విషయాన్ని బోల్డ్ డైరెక్టర్ గా ఫేమస్ అయినా సందీప్ వంగా తండేల్ ఫ్రీ రిలీజ్ వేదికగా మరోసారి ధృవీకరించారు. సందీప్ తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి మూవీ తో ఇండస్ట్రీని మరో ట్రెండ్ లోకి తీసుకెళ్లారనే చెప్పాలి. ఈ మూవీ వంగా కు విజయంతో సమానమైన వివాదాలను తెచ్చిపెట్టింది.
అయితే ఆ సినిమాలో హీరోయిన్ ‘ప్రీతి’ పాత్రకు గాను మొదటిగా సాయి పల్లవిని అనుకున్నానని, అయితే తానూ స్లీవ్ లెస్ డ్రెస్స్ యే వెయ్యదు ఇంకా ఇలాంటి బ్లోడ్ కంటెంట్ మూవీ లో ఎలా నటిస్తుంది, ఆ ఆశలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది అనే సలహా ఎదురవడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించున్నానంటూ వంగా పల్లవి క్యారెక్టర్ ను ఎలివేట్ చేసారు.
Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!
అలాగే ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా ఇంకా పల్లవి ట్రెండ్ వైపు పరుగులు తీయకుండా తన ట్రేడ్ మార్క్ వైపు నిలబడం చాల గ్రేట్ అంటూ పల్లవి డెడికేషన్ కు అభినందనలు తెలియచేసారు. ఇలా ఒక్క సందీప్ వంగా మాత్రమే కాదు సాయి పల్లవి ఏ చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్ర యూనిట్ నుండి ఇటువంటి ప్రసంశాలే దక్కుతాయి.
సినీ ఇండస్ట్రీ ప్రముఖులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా పల్లవి సింప్లిసిటీ కి ఫిదా అవుతూనే ఉంటారు. సాయి పల్లవి మాటలో, చూపులో, నవ్వులో, నటనలో స్వచ్ఛత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తానూ ఇలా గ్లామర్ షోలకు దూరంగా ఉంటున్నాను కదా అని గ్లామర్ షో లు చేసే ఏ ఇతర హీరోయిన్ల మీద కూడా సాయి ఎటువంటి కఠినమైన వ్యాఖ్యలు చేయరు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
ఒక టీవీ షో లో డాన్సర్ గా తెలుగు ప్రజలకు పరిచయమైన సాయి పల్లవి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ‘ఓన్లీ యాక్టింగ్..నో గ్లామర్ షో’ అనే ట్రెండ్ ని సెట్ చేసుకున్నారు, అలాగే అందరి చేత ప్రసంశలు అందుకోగలుగుతున్నారు. ఇక హీరోల డామినేషన్ ఎక్కువగా కనిపించే సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా తనకంటూ హీరోలతో సమానమైన ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకుని ట్రెండ్ సెట్టర్ గా ఎదిగి ఒదుగుతున్నారు.