సాక్ష్యాధారాలు ఉంటే చంద్రబాబు భయపడాలి కానీ వైసీపి ఎందుకు?

Sajjala Ramakrishna Reddyవైసీపికి సర్టిఫికేట్ లేని అడ్వకేట్ సజ్జల రామకృష్ణ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుపై తన వాదనలు మీడియాకి వినిపించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడిన్నట్లు ఏపీ సీఐడీ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అందుకే కోర్టులు రిమాండ్‌ పొడిగిస్తూ, బెయిల్‌ కూడా ఇవ్వడం లేదని సజ్జల చెప్పారు. కోర్టులే ఆయన అవినీతికి పాల్పడిన్నట్లు అనుమానిస్తూ బెయిల్‌ తిరస్కరిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని రాజకీయకక్ష అని ఎలా అంటారని సజ్జల వాదించారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని సజ్జల సవాలు విసిరారు.

ADVERTISEMENT

టిడిపి నేతలు ఇది రాజకీయకక్ష, కక్ష అని గొంతు చించుకొంటున్నారే తప్ప మా అధినేత అవినీతికి పాల్పడలేదని చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ పేరుతో చంద్రబాబు నాయుడు రూ. 300 కోట్లు అవినీతికి పాల్పడి భారీగా ప్రజాధనం లూటీ చేశారని సజ్జల ఆరోపించారు.

నారా లోకేష్‌ మాటిమాటికి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో తనకు అర్దం కావడం లేదన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా కంటే టిడిపి అధ్యక్షురాలన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో చేపట్టిన ప్రతీ పనిలో అవినీతి, అక్రమార్జన ఉన్నాయని సజ్జల ఆరోపించారు.

సజ్జల చెప్పిన్నట్లు ఏపీ సీఐడీ వద్ద చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడిన్నట్లు బలమైన సాక్ష్యాధారాలు ఉంటే వాటిని చూసి చంద్రబాబు నాయుడు భయపడాలి. కానీ ఆయనపై ఈ కేసు నమోదు చేసిన వైసీపి ఎందుకు భయపడుతోంది? భయపడకపోతే ఇది రాజకీయ కక్ష కాదని హటాత్తుగా అందరూ ఎందుకు పాట అందుకొన్నారు కదా?లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ కేసులను గట్టిగా సమర్ధించుకొన్న జగన్‌, ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఈ కేసులతో తనకు సంబందం లేదని ఎందుకంటున్నారు?

చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదని ఆయనతో సహా టిడిపి నేతలందరూ గొంతు చించుకొని చెపుతుంటే సజ్జలకు వినబడిన్నట్లు లేదు. సజ్జల చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు తనపై మోపబడిన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకొంటారు. ఆయన అవినీతికి పాల్పడ్డారో లేదో కోర్టులు ఎలాగూ తెలుస్తాయి. కానీ ఈలోగా సజ్జల న్యాయస్థానంలో తీర్పులు చెప్పకుండా నిగ్రహించుకొంటే మంచిది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో రూ.300 కోట్లు అవినీతి జరిగిందో లేదో తెలీదు కానీ అవినీతి జరిగిందని నిరూపించడానికి జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టేసింది. ఇంకా ఖర్చు పెట్టబోతోంది. జగన్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో నారా లోకేష్‌ కూడా అందుకే వెళుతున్నారని సజ్జలకు తెలీదా?అయితే జగన్‌ మోడీ, అమిత్ షాలని కలిసి వస్తుంటే లోకేశ్ సుప్రీంకోర్టు న్యాయవాదులతో భేటీ అవుతున్నారు అంతే తేడా!

ADVERTISEMENT
Latest Stories