చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలిట ఐరన్ లెగ్ అట

Pawan Kalyan - Chandrababu Naiduగతంలో చంద్రబాబు వస్తే వానలు పడవని ఒక వాదనను తెర మీదకు తెచ్చారు రాజశేఖరరెడ్డి. ఇది ప్రజలలోకి వెళ్లేలా చేసారు కూడా. ఇప్పుడు సాక్షి ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలిట ఐరన్ లెగ్ అని తేల్చి చెప్పేశారు. అది ఎలా అంటే చంద్రబాబుకు సపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ కు అన్ని ప్లాపులేనట.

ADVERTISEMENT

“యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే.. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి,” సాక్షి టీవీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.

బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి వక్ర భాషణలు చెయ్యొచ్చు లేదో విలువలు, విశ్వసనీయత గురించి నిత్యం మాట్లాడే వాళ్లే నిర్ణయించుకోవాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో రోజుకు ఏడూ ఆటలు, తెలంగాణాలో రోజుకు ఐదు ఆటలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories