తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. లగడపాటి వంటి వారు మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పిన తెరాస మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ లోని హేమాహేమీలు కూడా ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు కనీసం ఓటమిపై పోస్టు మోర్టమ్ కి కూడా ముందుకు రావడం లేదు. మాములుగా అయితే వారు టీడీపీ పొత్తుపై ఓటమిని గెంటేసేవారు. అయితే ఇంత ఘోరఓటమి తరువాత ఆ మాట అనడం కూడా కరెక్టు కాదు. అయితే సాక్షి మాత్రం దీనికి శతవిధాల ప్రయత్నిస్తుంది.
[m9ad]
ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమని చెబుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు… టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారంటూ చెబుతూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదని అధిష్ఠానం వద్ద పోరు పెడుతున్నారని రాసింది సాక్షి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని వారంటున్నారని సాక్షి.
అయితే ఇదంతా సాక్షి ఒక వ్యూహం ప్రకారం చేస్తుందా అని రాజకీయ విశ్లేషకుల అనుమానం. టీడీపీ తెలంగాణాలో ఫెయిల్ అయ్యింది అంటే ఆ ప్రభావం ఆంధ్ర మీద కూడా ఉంటుందని సాక్షి వ్యూహం. అదే సమయంలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు కూడా విచ్ఛిన్నం అవ్వాలని వైకాపా కోరుకుంటుందేమో. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మూడు పక్షాలు పోటీ పడుతున్నాయి. మూడు పక్షాలు గట్టిగా పోరాడితే చాలా చోట్ల క్లోజ్ గా ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు వల్ల అదనంగా వచ్చిన 1-2% ఓట్లు కీలకం అవుతాయా అనే అనుమానం వైకాపాలో కూడా ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా ఈ రెండు పక్షాలను విడగొట్టాలని సాక్షి ప్రయత్నిస్తుంది కావచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణాలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉండే అవకాశం అసలు ఉండదు. కాబట్టి ఏం జరగబోతుందో చూడాలి.



