తెలుగు మీడియా ఒక వైపు సాక్షి ఒకవైపు

Pawan Kalyan News TRP Ratingsపవన్ కళ్యాణ్ తన తొలివిడత ఆంధ్ర ప్రదేశ్ యాత్ర పూర్తి చేసుకునున్నారు. విజయనగరం నుండి ఒంగోలు దాకా సాగిన ఈ యాత్రలో ఆయన అన్ని జిల్లాలలోని జనసేన కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ యాత్రకు సాక్షి తప్ప అన్ని వార్త ఛానళ్ళు విశేషంగా కవరేజ్ ఇచ్చాయి. అయితే దీనిలో వాటికి లాభం లేకపోలేదు.

[m9ad]

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్, జనసేన కార్యకలాపాల ప్రసారం వల్ల టీవీ ఛానళ్ల రేటింగులు 30% పైగా పెరిగాయట. అయితే సాక్షి మాత్రం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రసారాలకే పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ తమ ఉనికికే ప్రమాదం అని జగన్ భావిస్తుండడమే దీనికి కారణం.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి చంద్రబాబుకు మేలు చేస్తారని జగన్ భయం. దీనిలో భాగంగా రోజు పవన్ కళ్యాణ్ పై పుంకానుపుంకాలుగా వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తుంది సాక్షి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తు అనేలా వార్తలు ప్రసారం చేస్తుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ జగన్ కు వ్యతిరేకంగా వివిధ వ్యాఖ్యలు చెయ్యడంతో సాక్షికి మరింత మింగుడు పాడనీ విషయం.

ADVERTISEMENT
Latest Stories