కోర్టు నుండి సమన్లు… చిక్కుల్లో స్టార్ హీరో..!

Salman Khan Court Case1998 సెప్టెంబర్‌లో బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్ త‌న‌ నలుగురు స్నేహితుల‌తో క‌లిసి రెండు కృష్ణజింకలను వేటాడారని ఆరోప‌ణ‌లు రావ‌డంతో, అప్ప‌టి నుంచి సల్మాన్ విచార‌ణ‌ల‌ను ఎదుర్కుంటూనే ఉన్నార‌న్న సంగ‌తి తెలిసిందే. సల్మాన్‌ని దోషిగా నిరూపించ‌డానికి స‌రైన ఆధారాలు లేవంటూ కొన్ని నెల‌ల క్రిత‌మే కోర్టు ఈ కేసును కొట్టి వేసిన‌ప్ప‌టికీ.. స‌ల్మాన్‌ ని మ‌ళ్లీ ఇదే కేసులో క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి.

ఆనాడు స‌ల్మాన్ వాడిన కారుని న‌డిపిన డ్రైవ‌ర్ మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డంతో ఈ కేసులో సల్మాన్ మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ్డాడు. తాజాగా ఈ కేసులో కోర్టు ముందు హాజరు కావాలంటూ జోథ్‌పూర్ కోర్టు సల్మాన్‌ కు సమన్లు పంపించింది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబూలు కూడా హాజ‌రు కావాల‌ని తెలిపింది. దీంతో వీరంతా ఈ నెల 25న మ‌రోసారి కోర్టులో స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories