గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ టాప్ ముద్దుగుమ్మలు విడుదల చేస్తోన్న హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా వేడెక్కింది. తొలుత రకుల్ ప్రీత్ సింగ్ ‘మాగ్జిమ్’ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన హాట్ పిక్ వైరల్ అయ్యి, నెటిజన్ల మతిపోగొట్టింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్, బాలీవుడ్ లో బ్రేక్ కోసం ఈ రేంజ్ లో అందాలు ఆరబోసినట్లుగా ట్రేడ్ వర్గాలలో గుసగుసలు వినిపించాయి. ఇలా రకుల్ బొమ్మ వైరల్ అయ్యిందో లేదో, ఇంతలో సమంత హాట్ పిక్ నెటిజన్లకు దర్శనమిచ్చింది.
బీచ్ పక్కన టూ పీస్ కాస్ట్యూమ్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వీక్షకుల లుక్ ను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుంది. నాగచైతన్యతో పెళ్ళైన తర్వాత ఈ రేంజ్ హాట్ పిక్ లో కనిపించడం ఇదే తొలిసారి కావడంతో, ఈ ఫోటో కూడా సోషల్ మీడియా వీక్షకులను ఒక ఊపు ఊపింది. అయితే ఇంతలో గుక్క తిప్పుకోనివ్వకుండా మరో ఫోటోను పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ‘మ్యాగ్జిమ్’ మ్యాగ్ జైన్ లో మరో ఫోటో అంటూ తన టాప్ సౌందర్యాలను బహిర్గతం చేసిన ఈ ఫోటో కన్నులవిందుగా మారింది.
ఇలా ఒకరిని మించి మరొకరు అందాల ఆరబోతలో దృష్టి కేంద్రీకరించడం విశేషం. ఈ రెండింటి మధ్యలో కాజల్ కు సంబంధించిన ఓ ఫోటో కూడా అభిమానులను విపరీతంగా అలరించింది గానీ, ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయలేదు. టాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఒకేసారి సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుండడంతో… ఇప్పుడే సమ్మర్ సెగ మొదలైనట్లుగా ఉంది. అయినా ఉన్నట్లుండి ఈ టాప్ తారామణులంతా ఎందుకు ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారనేది అర్ధం కాని సంగతి.



