చైతూ, సమంత ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!

samantha-naga-chaitanya-love-story-parties-hangout-shopping-malls-restaurentsసినీ సెలబ్రిటీలలో నాగచైతన్య, సమంతలు ఎంజాయ్ చేసినట్లుగా మరే ఇతర సెలబ్రిటీలు ఎంజాయ్ చేసి ఉండరని చెప్పడంలో సందేహం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్, ప్రిన్స్ మహేష్ బాబు – నమ్రత, సుమంత్ – కీర్తిరెడ్డిల వివాహాలు కూడా హీరో-హీరోయిన్ నేపధ్యం నుండి పుట్టుకొచ్చినవే. అయితే చైతూ – శ్యామ్ ల మాదిరి హంగామా ఏ ఒక్కరూ సృష్టించలేకపోయారు. ఒక విధంగా మీడియా కంట పడకుండా తమ ప్రేమను గుట్టుగా దాచుకుంటూ ఒక్కసారిగా పెళ్లిపీటలెక్కారు.

కానీ చైతూ – సమంతల రూటే సపరేటు. షాపింగ్ మాల్స్, కాఫీ డే, రెస్టారెంట్స్… ఇలా ఒకటేమిటి… సగటు ప్రేమికులు ఎంజాయ్ చేసే ప్రతి అంశంలోనూ వీరిద్దరూ సందడి చేసి… ఒక విధంగా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపారు. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఈ ఉధృతిని కాస్త తగ్గించిన ఈ సెలబ్రిటీ జంట, ‘ప్రేమమ్’ సినిమా విడుదల తర్వాత మాత్రం పబ్ లో డ్యాన్స్ లు చేస్తూ దర్శనమిచ్చారు. అలా ఎప్పటికప్పుడు అభిమానులకు, వీక్షకులకు కన్నుల విందు చేస్తున్న ఈ జంట తాజాగా మరో ఫోటోతో సోషల్ మీడియా ముందుకు వచ్చేశారు.

ADVERTISEMENT

ఓ పుస్తకం ఒడిలో పెట్టుకుని ముచ్చటలాడుకుంటున్న చైతన్య – సమంతల ఫోటో సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమైంది. ఇద్దరూ షార్ట్స్ లో ఉన్నా స్టైలిష్ గాగుల్స్, ట్రెండీ కాస్ట్యూమ్స్ తో కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫోటో, మరోసారి సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎందుకోసం ఈ ముచ్చట్లో గానీ, ఈ జంట మాత్రం టాలీవుడ్ హాట్ హాట్ గా మారింది. వీరి వివాహం వచ్చే ఏడాది ఆగష్టులో అన్న సమాచారం హల్చల్ చేస్తుండడంతో… అప్పటివరకు ఇలాంటి ఫోటోలు ఎన్ని చూడాల్సి వస్తుందో..!

ADVERTISEMENT
Latest Stories