విశాఖలో సంపూర్ణేష్ బాబు అరెస్ట్!

Sampoornesh-Babu-Arrest in Vizagఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ విశాఖ చేరుకున్న ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబుకు స్థానిక వాసులు ఘనస్వాగతం పలికారు. ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటేనని, అందుకే తెలంగాణకు చెందిన వ్యక్తిని అయినా, ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని ఆకాంక్షిస్తున్నానని మీడియా వర్గాలతో వ్యాఖ్యానించిన అనంతరం ఆర్.కే.బీచ్ వద్దకు చేరుకున్నారు సంపూ.

అయితే బీచ్ రోడ్డులో ఏ విధమైన నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని, సదరు దారిలో స్థానిక వాసులకు మాత్రమే అనుమతి ఉందని, అది కూడా వారు ఐడీ కార్డులు చూపిస్తేనే వదులుతున్నామని పోలీసులు సంపూకు తెలియజేసారు. అయితే తాము చేస్తోంది కేవలం మౌన ప్రదర్శన మాత్రమేనని సంపూ పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో, సంపూను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ADVERTISEMENT

ఒక్క విశాఖలోనే కాక, తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ వేదికగా కూడా విద్యార్ధులు ఒక్కొక్కరిగా ఏకమవుతుండగా, విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా నిరసనలు తెలియజేయడానికి విద్యార్ధులు గూమిగూడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ పై ఉన్న బారికేడ్లను తప్పించుకుని వెళ్ళాలని చూసిన ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ADVERTISEMENT
Latest Stories