చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదు – డైరెక్టర్ కు వార్నింగ్!

Sanjay leela Bhansali Attacked By Karni Senaప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై జరిగిన భౌతిక దాడిని సినీ పరిశ్రమలన్నీ ఖండిస్తున్నాయి. ఈ విధానం సరైనది కాదని హితవు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ పుత్ కర్ణిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి స్పందిస్తూ… సంజయ్ లీలా భన్సాలీపై దాడి సరైనదేనని సమర్ధించారు. చరిత్రను వక్రీకరించి సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు తీస్తాడని ఆరోపించారు.

గతంలో జోధా అక్బర్ సినిమాలో కూడా జోధాభాయ్ కథను వక్రీకరించాడని, అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశ పూర్వకంగా దాడి చేశామని తెలిపారు. జర్మనీ వెళ్లి హిట్లర్ పై ఎవరైనా సినిమా తీయగలరా? సంజయ్ లీలా భన్సాలీకి ఎంత ధైర్యముంటే తమ ప్రాంతానికే వచ్చి రాణి పద్మావతి దేవి చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

ADVERTISEMENT

ఈ పరిణామాలతో సినిమా యూనిట్ మొత్తం షూటింగును రద్దు చేసుకుని ముంబైకి తిరుగు పయనమైంది. ఇదిలా ఉంటే, ప్రముఖ చరిత్రకారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు చరిత్రలో పద్మావతి అనే రాణి లేదని బాంబు పేల్చారు. 1540లో మాలిక్‌ మహమ్మద్‌ జాయసి అనే కవి ‘పద్మావత్‌’ అన్న కావ్యంలో పద్మావతి అనే పాత్రని కల్పించారు. ఇది చారిత్రకంగా రుజువైన అంశమని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories