ఓడిపోయినా సలామ్ కొట్టాల్సిందే: బీజేపీ నాయకుడి రుబాబు!

sannapureddy suresh reddyరాష్ట్రంలో పార్టీ ప్రాబల్యం ఏమిలేకపోయినా బిజెపి నేతలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో పోటీ చేసి ఓడిపోయిన సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్ గేట్ రుబాబు చేసారు. దీనికి సంబందించిన కేసు నమోదు అయింది. ఆయన గూడూరు వద్ద ఒక ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్ గేట్ వద్ద వారి వాహనాలు చేరుకున్నప్పుడు గేట్లు తెరవలేదని , ఆయన అనుచరులు గొడవ సృష్టించారట. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాలని టోల్‌గేటు నిర్వాహకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ADVERTISEMENT

‘నువ్వేమి చేసుకుంటావో చేసుకో…నష్ట పరిహారం ఇచ్చేది లేదు’ అంటూ సురేష్‌రెడ్డి నిర్వాహకులతో దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలలో ప్రజాప్రతినిధుల చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓడిపోయిన నాయకులకు కూడా సలాం కొట్టాలంటే ఎలా చచ్చేది టోల్ ప్లాజాలలో పనిచేసేవాళ్ళు?

ADVERTISEMENT
Latest Stories