సినీ సెలబ్రిటీలు ధియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలంటే ఉండే పాట్లు అన్ని ఇన్ని కావు. హీరోలైతే రాజ్ తరుణ్ మాదిరి కళ్ళజోడు, గడ్డం, టోపీ పెట్టుకుని వెళ్లిపోవచ్చు, లేదంటే బన్నీ మాదిరి ఫ్యామిలీతో సహా అఫీషియల్ గా వెళ్లిపోవచ్చు. కానీ హీరోయిన్లకు మాత్రం సాధారణ ప్రేక్షకుల మాదిరి సినిమాలు చూడడమంటే చాలా కష్టమైన పని. ఇటీవల కాలంలో ముఖానికి గుడ్డ కట్టుకుని గుర్తు పట్టలేని విధంగా పలువురు హీరోయిన్లు చూస్తున్నారు గానీ, ఒకవేళ గుర్తు పడితే పరిస్థితి ఏంటన్న విషయం ఆలోచనలకు కూడా తావివ్వలేనిది.
తాజాగా ఇదే బాటలో అఖిల్ హీరోయిన్ సయేశా తన తమిళ “వనమగాన్” సినిమాను ముసుగేసుకుని చూసేసింది. అంతేకాదు ధియేటర్ నుండి ఓ సెల్ఫీ కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… తాను ఈ గెటప్ లో సినిమా చూసేసానని చెప్పింది. దీంతో సదరు ధియేటర్ కు వెళ్ళిన ఆడియన్స్ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. సినిమా పట్ల తమిళ ప్రేక్షకులు స్పందించిన విధానం మరిచిపోలేనని, విజిల్స్, గోలలతో ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. మొత్తానికి భలే బురిడి కొట్టించిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


