sankranthiki-vasthunam-game-changer-daaku-maharaaj

ఒక సినిమాని ఏవిదంగా ప్రమోట్ చేయవచ్చో లేదా చేయాలో ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప-2 సినిమాలు అందరికీ అర్దమయ్యేలా చూపాయి.

భారీ భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినప్పుడు కాస్త భిన్నంగా ఆలోచించి కాస్త గట్టిగా ప్రమోషన్స్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి రెండు వేల కోట్లు సాధించగలదని పుష్ప-2 నిరూపించి చూపింది.

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

అదే… సినిమాలో మంచి కధ, సత్తా కూడా ఉంటే మరికాస్త గట్టిగా ప్రమోట్ చేస్తే ఆస్కార్ అవార్డ్ కూడా సాధిస్తుందని ఆర్‌ఆర్‌ఆర్‌ నిరూపించి చూపింది.

సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్‌, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలకు మరీ అంతగా కాకపోయినా బాగానే ప్రమోషన్స్ నిర్వహించారు. వాటిలో రెండు గట్టిగా నిలబడ్డాయి. ఒకటి ఇంకా తడబడుతోంది.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

తాజాగా రజినీకాంత్ హీరోగా జైలర్‌కి సీక్వెల్‌గా జైలర్-2 మొదలుపెట్టారు. దాని ప్రారంభమే అదిరిపోయే విదంగా ఓ వీడియో రూపొందించి విడుదల చేశారు. అదొక్కటీ చాలు… జైలర్-2పై అంచనాలు పెంచేయడానికి!

ఈ ఓపెనింగ్ వీడియోలోనే భారీగా హింస, రక్తపాతం ఉన్నప్పటికీ, ఓ సినిమాని ఎంత గొప్పగా ప్రమోట్ చేసుకోవచ్చో ఈ చిన్న వీడియో చెపుతోంది. కనుక ఇకపై యావత్ భారతీయ సినీ పరిశ్రమ ప్రమోషన్స్‌ మరో స్థాయిలో ఉండవచ్చు.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

అయితే ఇండస్ట్రీలో సినిమాలని ప్రమోట్ చేయడమే కాదు.. సినిమాలని చంపేసే ట్రెండ్ కూడా నడుస్తోంది. గతంలో పలువురు చిన్న, పెద్ద హీరోల సినిమాలు ఇలాగే హత్య చేయబడ్డాయి. ఇక ముందు కూడా హత్య చేయబడుతూనే ఉంటాయి.

కానీ వాటిలో కొన్ని సినిమాలు ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన్నపుడు సూపర్ హిట్ అయ్యాయి. అంటే ప్రముఖులు చనిపోయిన తర్వాత అవార్డు లభించిన్నట్లు అనుకోవాలేమో?

సినిమా బాగున్నప్పటికీ నెగెటివిటీకి బలైపోవడం చాలా బాధాకరమే కాదు.. నిర్మాతలకు, సినీ పరిశ్రమకు తీరని నష్టం కలిగిస్తుందని, సినీ పరిశ్రమతోనే ఉంటూ దానిని ఈవిదంగా దెబ్బ తీసుకోవడం కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోవడమే అని ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే నైతిక విలువలను పోటీ మింగేస్తోంది కనుక.

ఇలా పనిగట్టుకొని ‘నెగెటివ్ రిపోర్ట్స్ వ్రాసేవారికి, నెగెటివ్ మౌత్ పబ్లిసిటీ చేసేవారి కుట్రలకి సంక్రాంతి బరిలో దిగిన గేమ్ చేంజర్‌ కూడా బలైపోయిందని చెప్పవచ్చు. సంధ్య థియేటర్‌ ఘటనలో అందరూ తలో రాయివేసిన్నట్లే గేమ్ చేంజర్‌పై కూడా వేసి దెబ్బ తీయాలని ప్రయత్నించారు.

కానీ గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌ ఏవిదంగా గేమ్ చేంజ్‌ చేశారో, అదే విదంగా ప్రేక్షకులకు నచ్చితే వారు కూడా గేమ్ చేంజ్‌ చేసి గేమ్ చేంజర్‌ని తప్పక నిలబెడతారు. కాస్త ఓపిక పడితే ఇదీ తేలిపోతుంది.




ప్రమోషన్స్‌తో సినిమాలను గెలిపించుకోవడం, నెగెటివ్ పబ్లిసిటీతో సినిమాలను హత్య చేస్తుండటం చూస్తున్నప్పుడు అణుబాంబుతో విజయం సాధించిన్నట్లు, దాంతోనే విధ్వంసం కూడా సృష్టించిన్నట్లు అనిపించక మానదు.