సెప్టెంబర్ 9: మూడు పార్టీలకు చరిత్రే…

September 9 reshaped Andhra politics

2023 సెప్టెంబర్ 9 ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన రోజుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. అయితే ఆ రోజు ఏపీలో ఉన్న మూడు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైన రోజుగానే భావించాలి.

ముందుగా నాడు అధికారంలో ఉన్న వైసీపీ తన అధికారంతో తీసుకున్న రెండు నిర్ణయాలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం మాదిరి మారిపోయింది. ఒకటి నాలుగుదశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చెయ్యడం,

ADVERTISEMENT

మరొకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ కాకూండా అడ్డుకోవడం, ఈ రెండు నిర్ణయాలు మూడు పార్టీల రాజకీయ భవిష్యత్ ని తలకిందులు చేశాయనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఆ అనాలోచిత నిర్ణయాలు వై నాట్ 175 అంటూ జగన్ కన్న కలలను కాలరాశాయి.

ఇక టీడీపీ విషయానికొస్తే…,టీడీపీ రాజకీయ ప్రయాణంలో సెప్టెంబర్ 9 2023….ఒక చీకటి రోజునే చెప్పాలి. అలాగే బాబు కుటుంబానికి అదొక మరిచిపోలేని చేదు అనుభవంగానే మిగిలిపోతుంది. ఇలా బాబు అరెస్టు తో టీడీపీ పనియిపోయింది అనుకున్న వైసీపీ కి టీడీపీ బలం ఏమిటో, టీడీపీ శ్రేణుల రిటర్న్ గిఫ్ట్ ఎలాంటిదో రుచి చూపించారు తెలుగు తమ్ముళ్లు.

ఇక మరోపక్క జనసేనాని నిర్బంధం తో వైసీపీ నాడు తాత్కాలిక గెలుపు ఆనందాన్ని అనుభవించింది. కానీ కట్ చేస్తే నాటి పవన్ నిర్బంధమే 2024 ఎన్నికలలో వైసీపీ అధికారానికి సంకెళ్లు వేసింది. పవన్ నిర్బంధం జనసేన క్యాడర్ లో కసిని పెంచితే, బాబు అరెస్టు టీడీపీ క్యాడర్ లో పట్టుదల పెంచింది.

ఆ రెండు కలిసి కూటమిగా ఏర్పడి 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ ని 11 తో పాతాళానికి తెచ్చింది. నాడు జరిగిన ఒక అరెస్టు, ఒక నిర్బంధం వైసీపీ పాలిట శాపంగా మారింది. దీనితో అసలు సెప్టెంబర్ 9…టీడీపీ కి కాదు వైసీపీ కి చీకటి రోజుగా మారిందని వైసీపీ శ్రేయోభిలాషులు సైతం భావిస్తారు.

రాజకీయ నాయకుడిగా ప్రజలకు మంచి చేస్తే దాని తాలూకా కృతజ్ఞత ఏ స్థాయిలో ఉంటుంది అని తెలుసుకోవడానికి బాబు అరెస్టు తరువాత జరిగిన పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలవగా, ఇక రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ హేళన చేసిన నేత తాలూకా అభిమాన బలం ఏ స్థాయిలో ఉంటుంది అనేదానికి కూడా ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది పవన్ నిర్బంధం.

అలాగే చేతిలో అధికారం ఉంది కదా అని అనాలోచిత నిర్ణయాలతో తాత్కాలిక మానసిక ఆనందాల కోసం వెంపర్లాడితే దాని తాలూకా ఫలితాలు ఎంత ఘోరంగా ఉంటాయనేది కూడా ఈ సెప్టెంబర్ 9 ఘటనలే వైసీపీ తెలిసొచ్చేలా చేసాయి.

ఏది ఏమైనా సెప్టెంబర్ 9 సంఘటనలు…. వైసీపీ కి ఒక మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ అందిస్తే, టీడీపీ, జనసేన కు ధైర్యం ఉంటే చీకటిలో కూడా యుద్ధం చెయ్యగలం అనే బలాన్ని అందించింది. ఇలా ఈ తేదీ ఈ మూడు పార్టీల రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నదనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories