తసమదీయుల కోసం అసమదీయులతో సిట్ విచారణ?

Palnadu voilence

ముందుగానే తీర్పు చెప్పి ఆనక కేసు విచారణ ప్రారంభించిన్నట్లుంది ఏపీలో అల్లర్లపై సిట్ బృందాల విచారణ. పోలీస్ బాస్ రాజేంద్రనాధ్ రెడ్డి మారి ఉండవచ్చు. కానీ ఆయన స్థానంలో డిజిపిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్‌ గుప్తా, సిఎస్ జవహర్ రెడ్డి సూచనల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది.

జగన్‌ ప్రభుత్వానికి వీరవిధేయుడుగా పేరు సంపాదించుకున్న జవహార్ రెడ్డి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు దర్యాప్తును ఏవిదంగా ముందుకు నడిపిస్తారో తేలికగానే ఊహించవచ్చు.

ADVERTISEMENT

ఈ అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందంలో మొత్తం 13 మంది అధికారులు ఉండగా వారిలో 9 మంది ఏసీబీకి చెందినవారే. అందరూ రాజేంద్రనాధ్ రెడ్డి విధేయులే. ఈ విచారణ పూర్తయిన తర్వాత వారందరూ ఏసీబీలో రాజేంద్రనాధ్ రెడ్డి కింద పనిచేయాల్సి ఉంటుంది. కనుక వారి నివేదిక ఏవిదంగా ఉండబోతోందో అర్దం చేసుకోవవచ్చు.

ఈ అల్లర్ల కారణంగా ఈసీ వేటు వేసిన ఎస్పీ తదితర పోలీస్ అధికారులు కూడా రాజేంద్రనాధ్ రెడ్డికి ఆత్మీయులే. అందరూ వైసీపి నేతలకు వీర విధేయులే. కనుక వారందరూ వైసీపి నేతలతో కుమ్మక్కు అయ్యి విధులు విస్మరించి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని సిట్ బృందం నివేదిక ఇవ్వగలదా? అంటే కాదనే అర్దమవుతోంది.

మరైతే ఏం జరుగబోతోంది?అంటే ఆత్మసాక్షి చిన్న క్లూ ఇచ్చింది. ‘సిట్ బృందాలు విచారణ చేపట్టగానే టిడిపి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని’ దాని సారాంశం. అంటే ఈ విచారణ ఏవిదంగా సాగుతోందో, ఏవిదంగా ముగియబోతోందో తేటతెల్లం అవుతోంది.

నేడు తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో విచారణ చేపట్టిన సిట్ బృందం, ఆవరణలో కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలు తదితర మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది. అవన్నీ టిడిపీ గూండాలవే అని నిర్ధారించేసి కేసులు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.

అలాగే అనంతపురం, తిరుపతి, పల్నాడులో అల్లర్లకు కూడా అధికారికంగా కాస్త ఎల్లో కలర్ పూసేస్తే చకచకా విచారణ పూర్తయిపోయిన్నట్లే. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు అధికార వైసీపియే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు, సిట్టింగ్ జడ్జ్ లేదా వైసీపితో ఎటువంటి సంబంధం లేని దర్యాప్తు సంస్థతో జరిపించి ఉండాలి. కానీ వైసీపి నేతల కనుసన్నలలో పనిచేసే అధికారులతోనే విచారణ జరిపిస్తుండటం చూస్తే ముందే ఎవరెవరిని ఈ కేసులలో బుక్ చేయాలో నిర్ణయించుకుని విచారణ ప్రారంభించిన్నట్లనిపిస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories